పరిచయం : Vanga Geetha Biography
- వంగా గీత, ఈమె పూర్తి పేరు ” వంగా గీత విశ్వనాధ్ “.
- ఆమెకు ఒక రాజకీయ నాయకురాలిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది.
- వంగా గీత గారు ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన వ్యక్తి.
- ఈ ఆధునిక సమాజంలో స్త్రీలందరు ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కుటుంబం :
- వంగా గీత గారు, ప్రకాశరావు మరియు బ్రహ్మరాంభ వారి దంపతులకు మార్చ్ 01 , 1964 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు.
- ఆమెకు తమ బంధువైన కాశీ విశ్వనాధ్ గారితో చిన్నతనంలోనే వివాహం జరిగింది.
- వంగా గీత మరియు కాశీ విశ్వనాధ్ దంపతులకు సంతానం గా ఒక కుమార్తె జన్మించారు.
విద్యాభ్యాసం – వృత్తి :
- లా (BL ) ఆంధ్ర యూనివర్సిటీ నుండి చదువుకున్నారు.
- మాస్టర్ అఫ్ లా – నాగపూర్ యూనివర్సిటీ నుండి చదువుకున్నారు.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ – పొలిటికల్ సైన్స్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , సైకాలజీ లో పూర్తి చేసారు.
- వంగా గీత గారు కొంత కలం న్యాయవాది గా కూడా పనిచేసారు.
రాజకీయ ప్రయాణం:
- 1983 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
- 1985 -1987 : మహిళా , శిశు సంక్షేమ రీజినల్ ఛైర్పర్సన్ గా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసారు.
- 1995 వ సంవత్సరంలో : కొత్తపేట జెడ్పీటీసీగా పనిచేసారు.
- 1995 – 2000 : తూర్పు గోదావరి జిల్లా, జెడ్పి ఛైర్పర్సన్ గా పనిచేసారు.
- 1997 వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా పనిచేసారు.
- 2000 – 2006 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరుపున, తెలుగు దేశం పార్టీ వైపునుండి రాజ్య సభ ఎంపీ గా పనిచేసారు.
- 2008 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో చేరారు.
- 2009 – 2014 : ప్రజా రాజ్యం పార్టీ తరుపున పిఠాపురం నుండి MLA గా పోటీ చేసి గెలుపొందారు.
- 2019 వ సంవత్సరం లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి వైయస్సార్సీపీ పార్టీ లో చేరారు.
- 2019 వ సంవత్సరం లో వైయస్సార్సీపీ పార్టీ తరుపున కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి MP గా పోటీ చేసి గెలుపొందారు.
- 2024 వ సంవత్సరంలో వైయస్సార్సీపీ పార్టీ తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేస్తున్నారు.
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
వంగా గీత – బయోగ్రఫీ : Vanga Geetha Biography
పూర్తి పేరు | వంగా గీత విశ్వనాధ్ |
జననం | మార్చ్ 01 , 1964 |
జన్మ స్థలం | ఆంధ్ర ప్రదేశ్ లో ని తూర్పు గోదావరి జిల్లా |
తండ్రి పేరు | ప్రకాశరావు |
తల్లి పేరు | బ్రహ్మరాంభ |
విద్యార్హతలు | లా (BL ), మాస్టర్ అఫ్ లా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ |
భర్త, పిల్లలు | భర్త : కాశీ విశ్వనాధ్ , పిల్లలు : ఒక కుమార్తె |
వృత్తి – వ్యాపారం | న్యాయవాది , రాజకీయం |
మతం | హిందువు |
కులం | కాపు |
ప్రస్తుత పదవులు | కాకినాడ MP (2019-2024) |
ప్రస్తుత రాజకీయ పార్టీ | వైయస్సార్సీపీ పార్టీ |
క్రిమినల్ రికార్డ్ | తెలీదు |
మెయిల్ ID | Vangageetha1.shakthipeetam@gmail.com |
ట్విట్టర్ ID | తెలీదు |
ఫేస్ బుక్ ID | https://www.facebook.com/vanga.geethaviswanadh/ |
ఇన్స్టాగ్రామ్ ID | https://www.instagram.com/vangageethaviswanadh/ |
ఫోన్ నెంబర్ | తెలీదు |