2024 వ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఆరు ముఖ్య హామీలు ఇచ్చారు. Deepam Pathakam Scheme
ఆ ఇచ్చిన ఆరు హామీలలో మహాశక్తి ఒకటి, ఆ మహాశక్తిలో భాగమే ఈ దీపం పధకం.
ఈ దీపం పధకం లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని అర్హత కలిగిన కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగా అందజేస్తారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందటానికి కావలసిన అర్హత:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందటానికి కావలసిన అర్హతల విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి.
కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అవసరమైన అర్హతల పై స్పష్టత ఇచ్చారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందటానికి కావలసినవి కేవలం మూడు అర్హతలు. ఈ క్రింది మూడు అర్హతలు కలిగినవారు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందటానికి అర్హులు.
- LPG గ్యాస్ కనెక్షన్
- తెల్ల రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందు విధానం: Deepam Pathakam Scheme
- 2024 వ సంవత్సరం అక్టోబర్ 29 వ తేదీన ఉదయం పది గంటలకు బుకింగ్లు ప్రారంభం అవుతాయి.
- మరియు మొదటి ఉచిత సిలిండర్ అక్టోబర్ 31 వ తేదీన డెలివరీ అవుతుంది.
- అర్హత ఉన్న వ్యక్తి ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ పధకంలో ఈ సిలిండర్ నమోదైంది అని మెసేజ్ వస్తుంది.
- గ్యాస్ బుక్ చేసుకున్న తరువాత పట్టణ ప్రాంతాలైతే 24 గంటలు మరియు గ్రామీణ ప్రాంతాలైతే 48 గంటలలోగా గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి చేరుతుంది.
- గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన వ్యక్తికి మనం మొత్తం డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది.
- డెలివరీ ఐన 48 గంటల్లోగా మనం గ్యాస్ సిలిండర్ కోసం కట్టిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది.
- ఉచిత గ్యాస్ సిలిండర్ పై మరిన్ని ఫిర్యాదుల కొరకు 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చు.
చదవండి: AP DSC – ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024
సంవత్సరంలో మూడు ఉచిత సిలిండర్లు పొందే కాలం:
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నియమాల ప్రకారం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు.
- అలా మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ 2025 వ సంవత్సరం మర్చి 31 వ తేదీ లోపు,
- రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ 2025 వ సంవత్సరం జులై 31 వ తేదీ లోపు
- మరియు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ 2025 వ సంవత్సరం నవంబర్ 30 వ తేదీ లోపు ఎప్పుడైనా పొందవచ్చు.
దీపం పధకం ప్రవేశపెట్టటానికి గల కారణం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీపం పధకం ప్రవేశపెట్టటానికి గల ముఖ్య కారణం గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెరిగిపోవటం.
ఈ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెరిగిపోవడం వలన నిరుపేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు కొనటం కష్టంగా మారి గ్యాస్ సిలిండర్లు కొనటం మానేశారు.
తరువాత మళ్ళీ కట్టిపుల్లలు వేరుకునే పరిస్థితికి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీపం పధకం ప్రవేశపెట్టటానికి గల మరో కారణం కట్ల పొయ్యి వలన కాలుష్యం పెరుగుతుంది మరియు ప్రజలు అనారోగ్య భారిన పడతారు.
కాబట్టి గ్యాస్ సిలిండర్లు వాడటం వలన ఆ రెండు ప్రమాదాలు తగ్గుతాయి.
ఇది గమనించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఈ దీపం పధకం మొదలుపెట్టారు.
దీపం పధకం యొక్క ముఖ్య ఉద్దేశం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దీపం పధకం మొదలుపెట్టి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటానికి గల ముఖ్య ఉద్దేశం నిరుపేద కుటుంబాలకు సహాయం చేసి గ్యాస్ సిలిండర్ వాడకాన్ని ప్రోత్సహించటం.
దీపం పధకం వలన రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు:Deepam Pathakam
ఈ దీపం పధకం వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంవస్త్రానికి కనీసం 2700 కోట్ల భారం పడనుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో గ్యాస్ సిలిండర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గ్యాస్ సిలిండర్ల కంపెనీలకు 894 కోట్లు చెల్లించింది.
ఇలా సంవత్సరానికి 2700 కోట్ల భారంతో మొత్తం 5 సంవత్సరాలకు 13500 కోట్ల భారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై పడనుంది.
దీపం పధకం వలన వచ్చే ప్రయోజనాలు:
ఆరోగ్య ప్రయోజనాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మొదటి ప్రయోజనం ఆరోగ్యం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన ప్రతి ఒకరు గ్యాస్ వాడటం మొదలుపెట్టి కెట్టెపుల్లలు మరియు కిరోసిన్ వాడకాన్ని తగ్గిస్తారు.
కాబట్టి వాటి నుంచి వచ్చే ప్రమాదకర పొగ దూరం చేయవచ్చు.
దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు మరియు గాలి కూడా స్వచంగా ఉంటుంది.
ఆర్ధిక భారం తగ్గటం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో ప్రయోజనం ఆర్ధిక భారం తగ్గించటం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన నిరుపేద ప్రజలకు ఆర్ధిక భారం తగ్గుతుంది.
ఉదాహరణకు ఇంతకముందు రేషన్ లో కిరోసిన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు.
కాబట్టి కిరోసిన్ కొనాలంటే చాల ఆర్ధిక భారం పడుతుంది. ఇప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వలన అది కూడా తగ్గుతుంది.
పర్యావరణ ప్రయోజనాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో ప్రయోజనం పర్యావరణ శుభ్రత.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన రాష్ట్ర ప్రజలు కట్టెపుల్లలు మరియు కిరోసిన్ తో వాడే పొయ్యే లను వాడటం తగ్గిస్తారు.
అలా తగ్గించడం వలన పర్యవరణం పరిశుభ్రంగా ఉంటుంది. Deepam Pathakam Scheme.
తక్కువ సమయంలో వండటం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో ప్రయోజనం తక్కువ సమయంలో వండటం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన ప్రజలు గ్యాస్ పొయ్యి వాడటం మొదలపెడతారు దీనివలన తక్కువ సమయంలో వంట చేయవచ్చు.
కానీ ఇంతకముందు లా కట్టెల పొయ్యి పై వంట చేయాలంటే చాల సమయం పడుతుంది.
చెట్లను కాపాడవచ్చు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో ప్రయోజనం చెట్లను కాపాడుకోవడం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన రాష్ట్ర ప్రజలు చెట్ల పై ఆధారపడటం తగ్గిస్తారు. కాబాట్టి దీనివలన చెట్లు సురక్షితంగా ఉంటాయి.
దీపం పధకం వలన కలిగే నష్టాలు:
ఆధారపడటం: Deepam Pathakam
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మొదటి నష్టం ప్రజాలు ప్రభుత్వాల పై ఆధారపడటం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన రాష్ట్ర ప్రజలు కొందరు వీటిపై ఆధారపడి సోమరిపోతుల్లా మారిపోతారు మరియు కష్టపడటం మర్చిపోతారు.
భద్రతా లోపాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో నష్టం భద్రత లేకపోవడం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన గ్యాస్ సిలెండర్లు వాడటం రాని వారికీ చాలా ప్రమాదకరం.
ప్రభుత్వం పై ఆర్ధిక భారం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో నష్టం ప్రభుత్వం పై ఆర్ధిక భారం పడటం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరానికి 2700 కోట్ల భారం పడనుంది.
పర్యావరణ నష్టాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల వలన వచ్చే మరో నష్టం పర్యావరణం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం వలన ప్రతిఒక్కరు గ్యాస్ వాడటం మొదలు పెడతారు.
కిరోసిన్ పొయ్యి కన్నా LPG గ్యాస్ మంచిదే కానీ అదికూడా ప్రమాదకరమే.
గ్యాస్ వాడకం విపరీతంగా పెరగడం వలన వాతావరణంలో మార్పులకు అవకాలున్నాయి.