ap-grama-volunteer
Share to Everyone

ఎన్నికలకు ముందు వృద్దులకు పింఛన్లు ఎలా?

వివిధ వార్తా కథనాల నుంచి సేకరించిన సమాచారాల ఆధారంగా :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 2024 ఎన్నికలకు, ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని సంచలమైన నిబంధలను ఏర్పాటు చేయ బోతున్నారు … YSR Pension Kanuka

ఈ నిబంధనలలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు మరియు వికలాంగులకు ప్రతి నెల పంపిణి చేసే ఫించన్లలో కీలక సమస్యలు తలెత్తబోతున్నాయి …

వివరాలలోకి వెళ్ళినట్లైతే,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు గ్రామా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల వృద్దులకు మరియు వికలాంగులకు ఇంటి వద్దనే పింఛన్లను అందచేయుచున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ద్వారా ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపు చేకూరింది అని అనడంలో ఆశ్చర్యం లేదు..

ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ల యొక్క కృషి చాలా ఉన్నది మరియు అందరు ప్రశంసించ దగినది…

కానీ సమస్య ఏమిటి అంటే..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు – మాజీ ఎలక్షన్ కమీషనర్, ఈ కార్యక్రమం మీద న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేయడం జరిగినది..

ఈ పిటిషన్ ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వృద్దులకు, వికలాంగులకు మరియు ఏ ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయడానికి, గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించ కూడదు అని …

దీనికి అనుసరిస్తూ ఎన్నికల కమిషన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నికలకు ముందు పింఛన్ల – Ysr Pension Kanuka పంపిణి కార్యక్రమానికి గ్రామ వాలంటీర్లను Ap Grama Volunteer ఉపయోగించకూడదు అని మరియు ఈ పంపిణి కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా వేరే ఇతర ప్రత్నామ్యాయ మార్గాలను ఏర్పాటు చేయాలనీ సూచించింది …

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రత్నామ్యాయ మార్గం :

ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్నామ్యాయ మార్గం ఎంచుకోబోతుంది. ఈ రెండు నెలలు గ్రామ వార్డు సచివాలయాలు ఉపయోగించి అక్కడే పింఛన్లను పంపిణి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు విస్తృత సమాచారం …

చదవండి :


Share to Everyone

By Admin

21 thoughts on “Ysr Pension Kanuka – ఎన్నికలకు ముందు వృద్దులకు పింఛన్లు ఎలా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *