Ambati Rambabu Biography
Share to Everyone

పరిచయం – Ambati Rambabu

Ambati Rambabu Biography – అంబటి రాంబాబు గారు వై ఎస్ ఆర్ సి పి రాజకీయ పార్టీ లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులలో ఒకరు. ఈయన మంచి వాక్ చాతుర్యం కలవారు.

అంబటి రాంబాబు గారు 2019 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శ్యాసన సభ ఎన్నికలలో సత్తెనపల్లె నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్.సి.పి. పార్టీ తరపున శ్యాసన సభ సభ్యుడిగా (MLA) పోటీచేసి గెలుపొందారు.

అంతేగాకుండా ప్రస్తుతం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో, భారీ నీటిపారుదల శాఖా మంత్రిగా (Irrigation Minister) కూడా విధులు నిర్వహిస్తున్నారు.

ఒకప్పుడు అంబటి రాంబాబు గారు కాంగ్రెస్ పార్టీ లో ఉండేవారు. కానీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం చెందిన తరువాత, ఆయన కాంగ్రెస్ పార్టీ ని వదిలి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తోడుగా నిలిచారు. కష్టకాలంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తోడుగా ఉన్న వారిలో అంబటి రాంబాబు గారు ఒకరు.

ఈ సంచికలో అంబటి రాంబాబు గారి కుటుంబం, జననం, బాల్యం, విద్యార్హతలు, వ్యాపారాలు, రాజకీయ ప్రవేశం మరియు ఈయన బాలలు, బలహీనతల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం …

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

కుటుంబం

అంబటి రాంబాబు గారు 1956 వ సంవత్సరం, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, రేపల్లె గ్రామంలో, AVSR ఆంజనేయులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.

అంబటి రాంబాబు గారి తండ్రి గారు కూడా రాజకీయాలకు సుపరిచితులు.

ఇక వారి వివాహ జీవితం గురించి చెప్పుకోవాలంటే, 1987 వ సంవత్సరంలో విజయలక్ష్మి  గారితో వివాహం జరిగింది. ఈ దంపతులిద్దరి కి ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు.

పూర్తి పేరు అంబటి రాంబాబు
జననం 1956 వ సంవత్సరం, గుంటూరు జిల్లా, రేపల్లె గ్రామం
తండ్రి పేరు AVSR ఆంజనేయులు
తల్లి పేరువెంకట సుబ్బమ్మ
భార్య, పిల్లలు విజయలక్ష్మి, ముగ్గురు ఆడ పిల్లలు
విద్యార్హతలుLLB
వృత్తి రాజకీయం
నియోజకవర్గంసత్తెనపపల్లె నియోజగవర్గం
ప్రస్తుత పదవులు 1. MLA-సత్తెనపపల్లె నియోజగవర్గం
2. Minister-భారీ నీటిపారుదల శాఖా
రాజకీయ పార్టీ వై.ఎస్.ర్.సి.పి పార్టీ
ఫోన్ నెంబర్ XXXXXXXXXX
మెయిల్ ID ysrcpambati@gmail.com
ట్విట్టర్ ID @Ambatirambabu

విద్యార్హతలు

  • అంబటి రాంబాబు గారు చిన్నప్పుడే రేపల్లె నుండి కృష్ణ జిల్లా అవనిగడ్డకు తరలి వెళ్లారు. వారు అక్కడే తన 10 వ తరగతి వరకు పాఠశాల విధ్యాబ్యాసాన్ని పూర్తిచేశారు.
  • ఆ తరువాత మల్లి రేపల్లె కు తరలి వచ్చి తన పై చదువులు LLB వరకు పూర్తి చేసారు.

రాజకీయ జీవితం

అంబటి రాంబాబు గారు తాను కాలేజీ లో చదువుతున్నప్పుడే రాజకీయాల మీద ఆసక్తి చూపించేవారు. వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఈ క్రింది విధంగా రూపు దాల్చింది….

తన చదువు LLB పూర్తిచేసుకున్న తరువాత న్యాయవాది  వృత్తిలో జీవితాన్ని మొదలుపెట్టారు. తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత …

  • 1988 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వారు అంబటి రాంబాబు గారిని, గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గా నియమించారు.
  • 1989 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున, రేపల్లె నియోజగవర్గం నుంచి శాసన సభ సభ్యునిగా ( MLA ) మొదటి సరి పోటీ చేసి గెలుపొందారు.
  • 1994 వ సంవత్సరంలో మరలా కాంగ్రెస్ పార్టీ తరపున, రేపల్లె నియోజగవర్గం నుంచి శాసన సభ సభ్యునిగా ( MLA ) పోటీ చేసి ఓటమి చెందారు.
  • 1994 వ సంవత్సరంలో మ్మెల్యే గా ఓటమి చెందిన, కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారిని డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మరియు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రెసోస్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించింది.
  • 1999 వ సంవత్సరంలో కూడా మరలా కాంగ్రెస్ పార్టీ తరపున, రేపల్లె నియోజగవర్గం నుంచి శాసన సభ సభ్యునిగా ( MLA ) పోటీ చేసి ఓటమి చెందారు.
  • 2005 నుండి 2007 వ సంవత్సరం వరకు అంబటి రాంబాబు గారిని, అప్పటి ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు APIIC చైర్మన్ గా నియమించారు.
  • 2009 వ సంవత్సరంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం చెందిన తరువాత, ఆయన కాంగ్రెస్ పార్టీ ని వదిలి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తోడుగా నిలిచారు.
  • 2010 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కి విరుద్ధంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని సమర్ధించినందుకు, కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
  • 2011 వ సంవత్సరంలో అంబటి రాంబాబు గారు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థాపించిన వై.ఎస్. ఆర్.సి.ప్. పార్టీ లో అధికారికంగా చేరారు.
  • 2014 వ సంవత్సరంలో వై.ఎస్.ర్.సి.పి పార్టీ తరపున, సత్తెనపపల్లె నియోజగవర్గం నుంచి శాసన సభ సభ్యునిగా ( MLA ) పోటీ చేసి ఓటమి చెందారు.
  • 2019 వ సంవత్సరంలో వై.ఎస్.ర్.సి.పి పార్టీ తరపున, సత్తెనపపల్లె నియోజగవర్గం నుంచి శాసన సభ సభ్యునిగా ( MLA ) పోటీ చేసి గెలుపొందారు.
  • ప్రస్తుతం 2022 వ సంవత్సరంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో, భారీ నీటిపారుదల శాఖా మంత్రిగా (Irrigation Minister) కూడా విధులు నిర్వహిస్తున్నారు.

అంబటి రాంబాబు గురించి పైన వివరించిన విషయాలలో ఏమైనా సమాచారం పొరపాటైతే, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వాటిని మేము సరిదిద్దుకుంటాము.

Ambati Rambabu Biography – అంబటి రాంబాబు గారి బయోగ్రఫీ తో పాటు మరి కొందరి రాజకీయ ప్రముఖుల బయోగ్రఫీ ల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.


Share to Everyone

By Admin

8 thoughts on “Ambati Rambabu Biography : చదువు, కుటుంబం, ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *