ఈ గ్రామ సచివాలయాలను(Grama Sachivalayam) గ్రామ సెక్రటేరియట్ అని కూడా అంటారు.
ఈ గ్రామ సచివాలయాలు ప్రతి ఒక పంచాయతీ కి ఒకటిగా మరియు ప్రతి ఒక మునిసిపల్ వార్డ్ కి ఒకటిగా ఉంటాయి.
మునుపటి లాగా ప్రజల ప్రభుత్వ పనుల కోసం మండలాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా, ఈ గ్రామ సచివాలయంలో మనకు కావలసిన ప్రభుత్వ పనులు మనము చేసుకోవచ్చు.
ఈ గ్రామ సచివాలయంలో ప్రభుత్వానికి సంబందించిన ప్రతి పని జరుగుతుంది.
గ్రామ సచివాలయాలు ప్రారంభించిన సంవత్సరం:
2019 ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు,
ఇంటి వద్దకే పాలనా అనే హామీ ప్రకారం మన జాతి పితా శ్రీ మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా,
అక్టోబర్ 2 / 2019వ సంవత్సరం నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు.
గ్రామ సచివాలయాల చరిత్ర: Grama Sachivalayam
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2019వ సంవస్తరం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో,
నవరత్నాలు అనే తొమ్మిది హామిలిలు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చారు. ఆ ఇచ్చిన తొమ్మిది హామీలలో గ్రామా సచివాలయం ఒకటి.
గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నుకున్న ప్రక్రియ:
- జులై 2019వ సంవత్సరం లో సచివాలయ సిబ్బంది ప్రక్రియ మొదలైంది.
- 1 సెప్టెంబర్ 2019 నుండి 8 సెప్టెంబర్ 2019 వరకు రాత పరీక్షా నిర్వహించారు.
- నిర్వహించిన తరువాత 19 సెప్టెంబర్ 2019 న రాత పరీక్షకు సంబందించిన ఫలితాలు విడుదల చేసారు.
- ఆ ఫలితాల్లో మొత్తం 1,98,164 అభ్యర్థులు ఉతీర్ణత సాధించారు.
గ్రామ సచివాలయాల పూర్తి సంఖ్య:
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2021 అక్టోబర్ నాటికి 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి.
- ఆ ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయాలకు గాను 1,26,649 మంది సచివాలయ సిబ్బంది మరియు 2,54,832 మంది వాలంటీర్లు ఎన్నికయ్యారు.
- ఈ ఎన్నికైన పూర్తి గ్రామ సచివాలయ సిబ్బంది సుమారు గా 3.2 కోట్ల మందికి సేవ చేయగలరు.
ఇది కూడా చదవండి : కుల ధృవీకరణ పత్రం – How to Apply Caste Certificate in Andhra Pradesh
ఒక సచివాలయం కింద ఉన్న ప్రజలు:
- సచివాలయంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి.
- గ్రామ సచివాలయాలు ప్రతి పంచాయతీకి ఒకటి మరియు వార్డు సచివాలయం ప్రతి వార్డుకి ఒకటి ఉంటాయి.
- కాబట్టి ఒక గ్రామ సచివాలయం కింద 2000 మంది పౌరులు ఉంటారు.
- అలానే ఒక వార్డు సచివాలయం కింద 4000 మంది పౌరులు ఉంటారు.
గ్రామ సచివాలయ సిబ్బంది జీతం:
గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి ఒక సంవత్సరానికి సుమారుగా 3,02,095 రూపాయలు ఇస్తారు.
అదే విధంగా గ్రామ వాలంటీర్ సిబ్బందికి సుమారుగా 1,60,000 రూపాయలు ఇస్తారు.
ఒక గ్రామ మరియు వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగులు:
ప్రతి గ్రామ సచివాలయంలో కొంత మంది ఉద్యోగులు పని చేస్తారు.
వారిలో మొదటి స్ధానంలో పంచాయత్ సెక్రటరీ ఉంటారు మరియు గ్రామ రెవిన్యూ ఆఫీసర్, ఒక లేడీ కానిస్టేబుల్, అసిస్టెంట్ సెక్రటరీ మరియు ఒక ఆరోగ్య శాఖకు సంబందించిన వ్యకి ఉంటారు.
గ్రామ సచివాలయాలలో అందించే సేవలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం మరియు విద్య, పారిశుధ్యం మరియు పరియావరణం, ప్రణాళిక మరియు నియంత్రణ సేవలను అందిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వానికి సంబందించిన ఎటువంటి పని లేదా పత్రాలు అవసరమయితె ఈ గ్రామ సచివాలయ సిబ్బంది తక్షణమే అందిస్తారు.
గ్రామ సచివాలయ ఉద్యోగంకు గల విద్య అర్హత:
- గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేయటానికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి.
- వాటిలొ మొదటిది పడవ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ డిగ్రీ పూర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
- విద్య అర్హత తరువాత అభ్యర్థి యొక్క వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
సిబ్బందికి గల ఎంపిక ప్రక్రియ:
- గ్రామ సచివాలయ- Grama Sachivalayam సిబ్బందిని ఎంచుకోటానికి ఒక ప్రక్రియ ఉంటుంది.
- ముందుగా ప్రభుత్వం నియామకం వదులుతారు ఆ తరువాత రాత పరీక్షా రాయవలసిన అవసరం ఉంటుంది.
- రాసిన తరువాత ఇంటర్వ్యూ కూడా పెడుతారు. అదే పూర్తయిన తరువాత మన విద్య పాత్రల ధ్రువీకరణ చేస్తారు.
గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షా రాయటానికి రుసుము:
ఉద్యోగ పరీక్ష రాయటానికి రుసుము కట్టడం అవసరం ఉంటుంది.
ఏ కులం వారైనా 200 రూపాయలు చెల్లించవలసిన అవసరం ఉంటుంది.
ఒకవేళ అభ్యర్థి వేరే ప్రాంతానికి చెందిన వాడైతే అదనంగా 100 రూపాయలు చెల్లించవలసిన అవసరం ఉంటుంది.
గ్రామ సాచివాలయాల వల్ల నిర్దిష్ష్ట సంఘాలకు గల ఉపయోగాలు:
-
గ్రామీణ సంఘాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ప్రవేశపెట్టిన తరువాత, గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పధకాలు ఉపయోగించుకోవటం సులభ తరంగా మారింది.
గ్రామ సచివాలయాలు రాక ముందు గ్రామ ప్రజలు ప్రభుత్వ పనులు చేసుకోవటనికి చాల దూరం వెళ్ళవలసి వచ్చేది.
కాబట్టి ఆ పనిని ఈ గ్రామ సచివాలయాలు సులభం చేసాయి.
- అట్టడుగు వర్గాలు:
SC, ST వంటి కొన్ని నిర్దిష్ట వర్గాలకు ఈ గ్రామ సచివాలయాలు చాల ఉపయోగపడ్డాయి.
ప్రభుత్వ పనులు సులభం గ చేసుకునేవారు. వారికీ అర్హత ఉన్న పధకాలను అందుకునేవారు.
-
రైతులు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రామ సచివాలయాలు – Grama Sachivalayam ప్రవేశపెట్టిన తరువాత, రాష్ట్రంలో వ్యవసాయ రంగం చాల అభివృద్ధి చెందింది.
ఉదాహరణకు రైతులకు సబ్సిడీలు అందించడం, రైతులకు సంబందించిన పధకాలు అందించడం మరియు వ్యవసాయ వస్తువులు అందించడం వంటి పనులు చేసేవారు.
-
స్త్రీలు మరియు పిల్లలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ సచివాలయాలు ప్రవేశపెట్టి స్త్రీల మరియు పిల్లలు సాధికారత పెంచింది.
ఉదాహరణకు వారికీ విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలు లాంటివి అందించింది.
-
యువత:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా యువతను చాల ఆదుకున్నారు.
ఉదాహరణకు వారికీ ఉద్యోగ అవకాశాలు కల్పించటం మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వంటి పనులు చేసారు.
-
ప్రేరణ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాలు మొదలపెట్టటానికి ముఖ్య ప్రేరణా భారత జాతి పిటా శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి గ్రామ స్వరాజ్య అనే ముఖ్య ఉద్దేశం.
గ్రామ మరియు వార్డు సచివాలయాలు ప్రధాన లోపాలు: Grama Sachivalayam
-
పరిమిత సామర్ధ్యం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు ప్రాధాన లోపం సామర్ధ్యం పరిమితంగా ఉండటం.
ఈ సచివాలయ సామర్ధ్యం పరిమితిగా ఉండటం వలన ప్రజల పనులు ఎక్కువగ ఉన్నప్పుడు ఈ గ్రామ సచివాలయ సిబ్బంది పని చేయటం చాల కష్ష్టంగా మారిపోతుంది.
-
నాణ్యతమైన సేవలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయ సిబ్బంది నాణ్యమైన సేవలు అందించటంలో వెనకపడ్డారు.
ఉదాహరణకు కుల మరియు ఆదాయ పత్రాలు అందించడంలో చాల ఆలస్యం అవుతుంది.
-
సిబ్బంది శిక్షణ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయంలో ఉన్న మరో లోపం సిబ్బందికి శిక్షణ అందించడం.
గ్రామ సచివాలయ సిబ్బందికి మంచి శిక్షణ మరియు నైపుణ్యాలు అందించినట్లైతే ప్రజలకు జరగవలసిన పనులు వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
-
మౌలిక సదుపాయాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ సచివాలయంలో ఉన్న మరో లోపం మౌలిక సదుపాయాలు లేకపోవడం.
గ్రామ సచివాలయ సిబ్బందికి ఇప్పటికి కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు అవి లేనందువలన సిబ్బంది పని చేయటం చాల కష్టంగా మారినది.
గ్రామ సచివాలయాలు నవీకరణ:
-
భవనాల సామర్ధ్యం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు సామర్ధ్యం మెరుగుపరచటానికి చెయ్యవలసిన మొదటి పని భవనాల సామర్ధ్యం పెంచటం మరియు సిబ్బందికి శిక్షణ పెంచటం వంటి పనులు చెయ్యాలి.
-
సాంకేతికత పెంచడం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు పనులు మెరుగుపరచటానికి ప్రతి సంవత్సరానికి ఒకసారి సాంకేతికతను పెంచాలి. ఆలా చేసినందు వలన ప్రజల పనులు కొంచం వేగంగా జరుగుతాయి.
-
అభిప్రాయ విధానం:
గ్రామ సచివాలయాలు పనులు మెరుగుపరచటానికి ప్రతి ఒక గ్రామ మరియు వార్డు సచివాలయాలలో అభిప్రాయం విధానం అమలు చెయ్యాలి.
ఆలా అమలు చేయడంవలన సచివాలయ సిబ్బంది పని చేయడంలో ఆసక్తి చూపి మెరుగైన పని చేస్తారు.
సామర్ధ్యాన్ని మెరుగుపరచటానికి తీసుకోవలసిన కొన్ని అంశాలు:
-
శిక్షణ కార్యక్రమం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు సామర్ధ్యం పెంచటానికి తీసుకోవలసిన మొదటి అంశం శిక్షణ కార్యక్రమాలు చేయటం.
ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి మాట్లాడే విధానం మరియు పని చేసే విధానం నేర్పించాలి.
ఆలా చేసినందున గ్రామ మరియు వార్డు సచివాలయాలు సామర్ధ్యం పెరుగుతుంది.
-
నిరంతరం నేర్చుకోవటం: Grama Sachivalayam
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు సామర్ధ్యం పెంచటానికి తీసుకోవలసిన మరో అంశం నిరంతరం నేర్చుకోవటం.
గ్రామ రేయి వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం వారు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటంలో ప్రోత్సాహం చేస్తే వారు కొత్త విషయాలు త్వరగా నేర్చుకొని చేసే పనిని త్వరగా పూర్తీ చేసే అవకాశం ఉంది.
-
మార్గదర్శక కార్యక్రమాలు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు సామర్ధ్యం పెంచటానికి తీసుకోవలసిన మరో అంశం మార్గదర్శక కార్యక్రమాలు చేయటం.
కొత్తగా చేరిన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి అనుభవం ఉన్న సిబ్బంది నుండి మార్గదర్శక కార్యక్రమాలు చేయాలి.
ఆలా చేసినందువలన కొత్త సిబ్బంది త్వరగా పని నేర్చుకునే అవకాశం ఉంది.
-
పనితీరు యొక్క మూల్యాంకనం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు సామర్ధ్యం పెంచటానికి తీసుకోవలసిన మరో అంశం సిబ్బంది పనితీరు యొక్క మూల్యాంకనం చేయటం.
ఆలా మూల్యాంకనం చేయడంవలన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందిలో పని చేయటానికి ఉత్సాహం పెరిగి పని త్వరగా మరియు సరిగ్గా పూర్తీ చేస్తారు.
గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉండాలా వద్దా: Grama Sachivalayam
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టిన తరువాత ప్రజలకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న దూరం తగ్గింది అని చెప్పవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలు రాక ముందు ప్రభుత్వ పనులు చేసుకోవడానికి మరియు ప్రభుత్వ పధకాలు అందుకోవడానికి ప్రజలు చాల దూరంలో ఉన్న మండలాలకు వెళ్లాల్సి వచ్చేదే.
కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టిన తరువాత వారి ఇంటికి దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో కావలసిన ప్రభుత్వ పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాలు వలన రాష్ట్ర ప్రజలకు చలా ఉపయోగాలు ఉన్నాయి.
కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల్లో ఈ గ్రామ సచివాలయాలు ఉండటం చాల అవసరం. కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఎలాంటి లోటు లేకుండా కొనసాగించాల్సిన అవసరం చాల ఉంది.
గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎలా సిద్ధం అవ్వాలి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగానికి పరీక్షా రాయవలసిన అవసరం ఉంటుంది.
ఆ పరీక్షకు సిద్ధం అవ్వడానికి ముందుగా పరీక్షా విధానం మరియు సిలబస్ తెలుసుకోవాలి తరువాత పరీక్షా సమయం మరియు పరీక్షా మార్కులు తెలుసుకొని తయారీ మొదలుపెట్టాలి.
గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగం మంచిదా లేదా:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయంలో పని చేయటం మంచిదా లేదా అన్న ప్రెశ్నకు,
కొందరు మంచిదే చేయవచ్చు అని మరికొందరు ఒత్తిడితో కూడుకున్న పని కాబట్టి చేయలేము అని అంటారు.
ఇదే ప్రశ్న మీద గూగుల్ లో ఒక వెబ్సైటు సమిక్ష నిర్వహించగా,
ఒక వ్యక్తి నేను ఈ పనిలో చాల విషయాలు నేర్చుకున్నాను మరియు చాల సంతోషంగా పని చేశాను అని సమాధానం ఇవ్వగా మరో వ్యక్తి ఈ సచివాలయ ఉద్యోగంలో చాల ఒత్తిడి ఉంటుంది కాబట్టి చేయలేము అని జవాబు ఇచ్చారు.
[…] […]