గ్రామ వాలంటీర్ – Grama Volunteer సంస్ధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనలో ఒక కీలకమైన సంస్ధగా ఏర్పడింది. ఈ గ్రామ వాలంటీర్లను ప్రతి 40 ఇళ్లకు ఒక వాలంటీర్ని ప్రభుత్వం నియమించింది.
ఈ గ్రామ వాలంటీర్లు ప్రజలకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వంతెనల పని చేస్తారు .
రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ సంస్దను ప్రవేశపెట్టిన సంవత్సరం:
- 2019 వ సంవత్సరం లో శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పాలన అన్న హామీ ఇచ్చారు.
- 2019 రాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన అనంతరం గ్రామ వాలంటీర్ సంస్ధను ప్రవేశపెట్టారు.
గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి కావలసిన అర్హత:
- గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి కావలసిన మొదటి అర్హత, అభ్యర్థి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- మరియు అభ్యర్థి ఎక్కడ పని చేయాలో అక్కడే వాసిగ ఉండాలి, మరియు అదే పంచాయతీకి సంబంధించిన వాసి అయిఉండాలి.
- మరియు పట్టణంలో పనిచేయాలంటే డిగ్రీ పాస్ అయ్యుండాలి, గ్రామాల్లో ఇంటర్, మరియు గిరిజన ప్రాంతాల్ల పదవ తరగతి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.
గ్రామ వాలంటీర్ జీతం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లకు ఒక స్సంవత్సరానికి ఒక లక్ష ఇరవైవేల రూపాయలు ఇస్తారు.
ఇది కూడా చదవండి : అన్న క్యాంటీన్ల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు
గ్రామ వాలంటీర్ల బాధ్యతలు:
-
ఇంటి వద్దకే పాలన అందించడం:
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వాలంటీర్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఇంటి వద్దే పనులు చేయాలి,
ఉదాహరణకు ఇంటి వద్దే పెన్షన్లు పంచటం మరియు ప్రజల అవసరాలను తీర్చాలి.
-
సర్వే మరియు డేటా సేకరణ:
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వాలంటీర్ల బాధ్యతలలో మరొకటి సర్వే మరియు డేటా సేకరించటం.
గ్రామ వాలంటీర్లు సర్వేలు నిర్వహించి ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు అర్హులో కాదో చూడాలి.
చూసిన వెంటనే పథకాలకు అవసరమైనా డేటా ను ప్రజల నుండి తీసుకోని గ్రామ సచివాలయంలో అందించాలి.
-
సామాజిక తనిఖీ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్ల బాధ్యతల్లో మరొకటి సామాజిక తనిఖీ చేయటం.
సామాజిక తనిఖీ చేయటంలో గ్రామ వాలంటీర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
సామాజిక తనిఖీ చేసి పారదర్శకతను నిర్దారిస్తారు మరియు జవాబుదారీతనం చూపుతారు,
మరియు గ్రామాల స్థాయిలో రాష్ట్రం అందించే పధకాలను అందించటంలో సహకారం చేస్తారు.
-
సంఘం సమీకరణ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్ల బాధ్యతల్లో మరొకటి సంఘాలను సమీకరించటం.
ప్రజలు స్థానిక పాలనలో పాల్గొనేందుకు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో గ్రామ వాలంటీర్లు సంఘాలను సమీకరిస్తారు.
-
అభిప్రాయ విధానం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్ల బాధ్యతల్లో మరొకటి అభిప్రాయ విధానం అమలు చేయటం.
రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు అభిప్రాయ విధానాన్ని అమలు చేస్తారు మరియు ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పటం మరియు గ్రామాల అభివృద్ధి లో కృషి చేస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ముఖ్యమైన ప్రభావం:
-
మెరుగైన సేవ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వళ్ళ వచ్చిన ముఖ్య ప్రభావాలలో మెరుగైన సేవ అందించటం ఒకటి.
గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత ప్రజలకు మెరుగైన సేవ అందడం మొదలైంది మరియు ప్రభుత్వానికి సంబందించిన ఏ పని ఐన ఇంటి వద్దే చేసుకోవచ్చు.
-
పెరిగిన భాగస్వామ్యం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వలన వచ్చిన మరో ప్రభావం ప్రజలలో భాగస్వామ్యం పెరగడం.
గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రవేశమైన తరువాత ప్రజలలో భాగస్వామ్యం పెరిగింది మరియు అందరు స్థానిక పాలనలో పాల్గొంటున్నారు మరియు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
-
సమర్ధవంతమైన సంభాషణ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వలన వచ్చిన మరో ప్రభావం సమర్ధవంతమైన సంభాషణ అందించటం.
గ్రామ వాలంటీర్లు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఒక వంతెనలా పనిచేస్తారు.
వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ప్రజలకు మరియు ప్రభుత్వానికి సమర్ధవంతమైన సంభాషణ ఏర్పడింది.
-
అవగాహన:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వలన వచ్చిన మరో ప్రభావం అవగాహన కలిపించటం.
వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలలో అవగాహన పెరిగింది.
-
జవాబుదారితనం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వలన వచ్చిన మరో ప్రభావం జవాబుదారీతనం.
గ్రామ వాలంటీర్ వ్యవస్ధ రాకముందు ప్రజలకు జవాబు చెప్పే వారు లేరు కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్ధ ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వం జవాబుదారీతనంగా పని చేస్తుంది.
గ్రామ వాలంటీర్ల రాజీనామా: Grama Volunteer Resignations
2024 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారం లో NDA ప్రభుత్వం 5 వేల రూపాయల జీతాన్ని 10 వేల రూపాయలు చేస్తామని హామీ చేసారు.
కానీ అంతలో దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మంది గ్రామ వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసారు.
రాజీనామా చేసిన వాలంటీర్లు NDA ప్రభుత్వం గెలిచిన తరువాత మల్లి విధుల్లో చేర్చుకోమని కోరుతున్నారు.
రాజీనామాకు గల కారణాలు అడిగితె గత ప్రభుత్వం వారు బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్నారు.