అన్న క్యాంటీన్ :
Anna Canteen అనేవి 2016వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా వెలగపూడి పట్టణంలో ప్రారంభించారు.
దీనికి అన్న క్యాంటీన్ అనే పేరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ స్థాపకుడు శ్రీ నందమూరి తారక రామ రావు గారి పేరున అన్న క్యాంటీన్ అనే పేరు పెట్టారు.
ప్రారంభించడానికి గల కారణం:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూలీలు మరియు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వారు బయట భోజనం చెయ్యాలంటే కనీసం ఉదయం 20 నుండి 30 మరియు మధ్యాహ్నం 70 నుండి 100 రూపాయలు అవసరం పడుతాయి.
- కానీ కూలీలకు రోజుకు 600ల రూపాయల నుండి 700 ల రూపాయలు ఇస్తారు. ఇలాంటి వారు రోజుకి 100 నుండి 150 రూపాయలు తినటానికి ఖర్చు చేయటం కష్ష్టం.
- బిక్షం ఎత్తుకునే వారు కడుపునిండా తినాలంటే చాల కష్టం.
- ఇది ఆలోచించిన ప్రభుత్వం ఎవరు ఆకలితొ నిద్రపోకూడదు అన్న విషయం దృష్టిలో పెట్టుకొని అన్న క్యాంటీన్లు ప్రారంభించారు.
ప్రారంభించడానికి గల ప్రేరణ:
- 2013వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై నగరం లో తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత గారు అమ్మ ఉనావాగం పేరుతొ క్యాంటీన్ ప్రారంభించారు.
- దీనితొ ప్రేరణ పొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు 2016వ సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రారంభించారు.
అన్న క్యాంటీన్ లో ధరలు:
ప్రస్తుతం అన్న క్యాంటీన్ లో మూడు పూటల భోజనం పెడతారు.
కానీ పేదవారిని దృష్టి లో పెట్టుకున్న ప్రభుత్వం ఒక పూటకి 5 రూపాయలు తీసుకొని భోజనం పెడతారు.
కాబట్టి ఒకరోజుకి 15 రూపాయలు ఉంటె సులభంగా ఎవరైనా భోజనం చేయవచ్చు.
అన్న క్యాంటీన్ లు మూయటానికి గల కారణం: Anna Canteen
- 2016 వ సంవత్సరం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన తరువాత 2019వ సంవస్త్సరం వరకు పని చేసాయి కానీ,
- 2019వ సంవత్సరం లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
- వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా రెండు నెలలకు అన్న క్యాంటీన్లు పనిచేయటం ఆగిపోయాయి.
- ఈ అన్న క్యాంటీన్ లను అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ప్రభుత్వం నుండి కాంట్రాక్టు తీస్కొని పని చేసే వారు.
- వైస్సార్సీపీ గెలిచినా రెండు నెలలకు వారి కాంట్రాక్ట్ పూర్తీ అయ్యింది.
- దాని తరువాత ప్రభుత్వం నుండి ఎలాంటి సందేశం లేనందువల్ల వారు పని చేయటం ఆపేసారు.
అన్న క్యాంటీన్ల పునప్రారంభం:
2024 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తిరిగి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు గెలిచారు.
గెలిచిన అనంతరం 15 ఆగష్టు 2024 న భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు.
అన్న క్యాంటీన్ల వాళ్ళ లాభాలు: Anna Canteen Benefits
సరసమైన ధరకే భోజనం:
- అన్న క్యాంటీన్ వల్ల వచ్చే మొదటి లాభం సరసమైన ధరకే భోజనం అందించడం.
- దీనివల్ల పేదలకు మూడుపూటలా తినటం చాల సులభంగ ఉంటుంది. ఒక పూటకి 5 రూపాయలు అవసరం ఆడుతుంది కాబట్టి 15 రూపాయలతొ ఒక రోజు గడిచిపోతుంది.
- అదే భోజనం బయట తినాలంటే ఒక రోజుకి కనీసం 150 రూపాయల నుండి 200 రూపాయలు కావాలి. కాబట్టి పేదవారికి ఇది చాల ఉపయోగపడుతుంది.
పోషకమైన ఆహరం:
- అన్న క్యాంటీన్ వల్ల వచ్చే రెండో లాభం పోషకమైన ఆహరం అందించటం.
- ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం పోషకమైన ఆహరం అందించడం.
- అక్కడ పని చేసేవారు చాల పరిశుభ్రత పాటిస్తారు మరియు నాణ్యమైన వస్తువులు వాడుతారు.
- మరియు అక్కడ పని చేసేవారు చేతులకి మరియు తలకు గుడ్డ కడుతారు. మరియు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
- అన్న క్యాంటీన్ వల్ల వచ్చే మూడో లాభం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.
- ఎలాఐతే ప్రభుత్వం పోషక ఆహరం అందిస్తోందో దాని వాళ్ళ అక్కడ తిన్న వారి ఆరోగ్యం చాల బాగుంటుంది.
- ఇలాంటి పోషక ఆహరం బయట తినాలంటే చాల డబ్బులు కావాలి. కానీ ఈ క్యాంటీన్లు వాటిని కేవలం 5 రూపాయలకే అందిస్తున్నాయి.
ఆకలి తగ్గించడం:
- అన్న క్యాంటీన్ వల్ల వచ్చే నాలుగవ లాభం ఆకలి తగ్గించడం. అన్న క్యాంటీన్లు ప్రారంభించిన తరువాత ఆకలి తొ పడుకునే వారి సంఖ్య తగ్గింది.
- దీనివల్ల ప్రతి ఒక్కరు మూడుపూట్ల తినగలుగుతున్నారు.
ఉపాధి అవకాశం:
- అన్న క్యాంటీన్ వల్ల వచ్చే నాలుగవ లాభం ఉపాధి అవకాశాలు కలిపించటం.
- ఈ అన్న క్యాంటీన్లు నడపడానికి కచ్చితంగా మనుషుల అవసరం పడుతుంది. కాబట్టి దీనివల్ల కొంత మంది కి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుంది.
అన్న క్యాంటీన్ల వల్ల కలిగే సమస్యలు: Anna Canteen Obstacles
ఆర్ధిక భారం:
- అన్న క్యాంటీన్ల వలన వచ్చే మొదటి సమస్య ఆర్ధిక భారం.
- అన్న క్యాంటీన్లో నాణ్యమైన వస్తువులు వాడుతారు మరియు కేవలం 5 రూపాయలకే భోజనామ్ పెడుతున్నారు దీని వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక భారం పడుతుంది.
కార్యాచరణ సవాళ్లు:
- అన్న క్యాంటీన్ల వలన వచ్చే రెండవ సమస్య కార్య చరన సవాళ్లు ఎదుర్కోవడం.
- క్యాంటీన్లు నడపడంలో మరియు నాణ్యత పాటించడంలో మరియు సేవ చేయటంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని సమస్స్యలు కూడా వస్తాయి.
- వాటిని దాటుకొని మల్లి యధావిధిగా పని చేయాలి.
అన్న క్యాంటీన్లపై ఆధారపడటం:
- అన్న క్యాంటీన్ల వలన వచ్చే ముడవా స్సమస్య వాటిపై ఆధారపడటం. అతితక్కువ ధరకే నాణ్యమైన భోజనం దొరుకుతుంది.
- కాబట్టి దీని గురించి ఆలోచించిన కొంత మంది రాష్ట్ర ప్రజలు అన్న క్యాంటీన్ల పై ఆధారపడి సోమరిపోతులుగా మారిపోతున్నారు. కొంత మంది అయితె ఏకంగా పనులు చేయటం మానేస్తున్నారు.
స్థానిక ఆహారా వ్యాపారంపై ప్రభావం:
- అన్న క్యాంటీన్ల వలన వచ్చే నాలుగవ సమస్స్య స్థానిక ఆహార వ్యాపారుల పై ప్రభావం పడటం.
- అన్న క్యాంటీన్లు పెట్టడం వలన చాల మంది ఉన్నత వ్యక్తులు కూడా అక్కడే తినటం మొదలు పెట్టారు.
- అల తినటం వలన స్థానిక ఆహార వ్యాపారాలు బలహీన పడుతున్నాయి మరియు నేరుగా వాటిపై ప్రభావం పడుతుంది.
స్థిరత్వం:
- అన్న క్యాంటీన్ల వాలన్న కలిగే ఐదవ సమస్స్య స్థిరత్వం లేకపోవటం.
- ముఖ్యంగా అన్న క్యాంటీన్లు ఆదాయ మూలం కాదు కానీ వాటిని నడపటానికి చాల డబ్బులు అవస్రం పడుతాయి.
- ఆ డబ్బులని కొంత మంది ధనవాంతులు మరియు మహా వ్యాపారవేత్తలు విరాళంగా ఇస్స్తారు మిగతా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
- విరాళాలు రాకపోతే అన్న క్యాంటీన్లు నడపటం చాల కష్టమైన పనిగా భావించవచ్చు.
- కాబట్టి విరాళాలు రావటం ఆగిపోతే అన్న క్యాంటీన్లు నడవటం కొన్ని సార్లు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నాణ్యత నియంత్రణ:
- అన్న క్యాంటీన్ల వలన కలిగే మరో సమస్య నాణ్యతను నియంత్రించటం.
- భోజనమ్ పెట్టేటప్పుడు నాణ్యతను నియంత్రించడం చాల కష్టం మరియు భద్రత వహించటం కూడా చాల కష్టమైన పనిగా మనం భావించవచ్చు.
అన్న క్యాంటీన్లను నడపటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు: Anna Canteen
పరిశుభ్రత ప్రమాణాలు:
- అన్న క్యాంటీన్లు నడపటంలో తీస్కోవాల్సిన మొదటి జాగ్రత్త పరిశుభ్రత ప్రమాణాలు పాటించటం.
- మొదటిగా అన్న క్యాంటీన్ల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి.
- మరియు అక్కడ పని చేసేవారు పరిశుభ్రత పాటించాలి.
నాణ్యత పాటించడం:
- అన్న క్యాంటీన్లు నడపడంలో తీసుకోవాల్సిన మరో జాగ్రత్త నాణ్యత పాటించటం.
- అన్న క్యాంటీన్లలో అందించే భోజనంలో వాడే ఆహార ప్రదార్దాలలో నాణ్యతమైన వస్తువులు వాడాలి.
- ఆలా వాడకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
శిక్షణ సిబ్బంది:
- అన్న క్యాంటీన్లు నడపడంలో తీసుకోవాల్సిన మరో జాగ్రత్త శిక్షణ సిబ్బందిని పెట్టడం.
- అన్న క్యాంటీన్లో పని చేసే సీబ్బంది పూర్తి శిక్షణ కలిగి ఉండాలి.
- ఆలా ఉండటం వలన అన్న క్యాంటీన్లు విజయావంతం చేయవచ్చు.
సాధారణ తనిఖీ:
- అన్న క్యాంటీన్లు నడపడం లో తీసుకోవలసిన మరో జాగ్రత్త సాధారణ తనిఖీ చేయటం.
- అన్న క్యాంటీన్లను నడుపుతున్న పరిసరాలను మరియు వాడుతున్న వాయువులను తరచూ ప్రభుత్వ పెద్దలు తనిఖీ చెయ్యాలి.
- ఆలా చేస్తే నాణ్యత పాటించవచ్చు.
రాష్ట్రం లో ప్రస్తుత అన్న క్యాంటీన్ల సంఖ్యా:
2019 రాష్ట్ర ఎన్నికల తరువాత మూసివేసిన అన్న క్యాంటీన్లను….
2024 రాష్ట్ర ఎన్నికల్లో శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు గెలిచి 15 ఆగష్టు 2024 వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా,
99 అన్న క్యాంటీన్లను కృష్ణ జిల్లా గుడివాడ లో మొదలు పెట్టారు.
సెప్టెంబర్ 5వ తేదీ లోగ మరో 103 అన్న కాంటీన్లను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు మాటిచ్చారు.
అన్న క్యాంటీన్లు పని చేయు వేళలు:
అన్న క్యాంటీలో మూడు పుటల భోజనం పెడతారు.
ఉదయం టిఫిన్ 7 గంటల నుండి 10 గంటల వరకు మరియు మధ్యన భోజనం మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు మరియు రాత్రి భోజనం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది.
ఆహార మెనూ:
అన్న క్యాంటీన్లు వారానికి ఆదివారం మినహాయించి మిగతా ఆరు రోజులు నడిపి ఆదివారం రోజు సెలవుగా ప్రకటించారు.
సోమవారం:
సోమవారం ఉదయం ఇడ్లీ చట్నీ / పొడి సాంబార్ లేదా పూరి కుర్మా పెడతారు. అదే రోజు మధ్యాహ్నం మరియు రాత్రి వైట్ రైస్, కూర, పప్పు / సాంబార్,పెరుగు మరియు పచ్చడి పెడతారు.
మంగళవారం:
మంగళవారం ఉదయం ఇడ్లీ చట్నీ / పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ / పొడి, సాంబార్, మిక్చర్ పెడుతారు.
అదే రోజు మధ్యాహ్నం మరియు రాత్రి వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు మరియు పచ్చడి పెడుతారు.
బుధవారం:
బుధవారం ఉదయం ఇడ్లీ, చట్నీ / పొడి సాంబార్ లేదా పొంగల్, చట్నీ / పొడి మరియు సాంబార్ పెడుతారు.
అదేరోజు మధ్యాహ్నం మరియు రాత్రి వైట్ రైస్ కూర పప్పు / సాంబార్ పెరుగు పచ్చడి పెడుతారు.
గురువారం:
గురువారం ఉదయం ఇడ్లీ, చట్నీ / పొడి, సాంబార్ లేదా పూరి మరియు కుర్మా పెడుతారు.
అదే రోజు మధ్యాహ్నం మరియు రాత్రి వైట్ రైస్, కూర, పప్పు / సాంబార్, పెరుగు మరియు పచ్చడి పెడుతారు.
శుక్రవారం:
శుక్రవారం ఉదయం ఇడ్లీ, చట్నీ / పొడి, సాంబార్ లేదా ఉప్మా పెడుతారు అదే రోజు మధ్యాహ్నం,
మరియు రాత్రి వైట్ రైస్, కూర, పప్పు / సాంబార్, పెరుగు మరియు పచ్చడి పెడుతారు.
శనివారం:
శనివారం ఉదయం ఇడ్లీ, చట్నీ / పొడి, సాంబార్ లేదా పొంగల్ పెడుతారు మరియు అదే రోజు మధ్యాహ్నం,
మరియు రాత్రి వైట్ రైస్, కూర, పప్పు / సాంబార్, పెరుగు మరియు పచ్చడి పెడుతారు.
[…] ఇది కూడా చదవండి : అన్న క్యాంటీన్ల గురించి మీరు తెలుసుక… […]