thamballapalle-assembly-constituency
Share to Everyone

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకుంటుంది. మరియు తంబళ్లపల్లెలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Thamballapalle Assembly Constituency

  1. తంబళ్లపల్లె మండలం
  2. ములకలచెరు మండలం
  3. పెద్దమండ్యం మండలం
  4. కురబలకోట మండలం
  5. బి.కొత్తకోట మండలం
  6. పెద్దతిప్పసముద్రం మండలం

తంబళ్లపల్లె నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1. 1955-1962 T. N. వెంకటసుబ్బా రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2. 1962-1967 కడప నరసింహ రెడ్డి స్వతంత్ర పార్టీ
3. 1967-1972 T. N. అనసూయమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4. 1972-1978 T. N. అనసూయమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5. 1978-1983 ఆవుల మోహన రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. 1983-1985 టి. ఎన్. శ్రీనివాస రెడ్డి తెలుగు దేశం పార్టీ
7. 1985-1988 అనిపిరెడ్డి వెంకట లక్ష్మి దేవమ్మ తెలుగు దేశం పార్టీ
8. 1988-1989

(ఉప ఎన్నిక)

చింతల రామచంద్రారెడ్డి తెలుగు దేశం పార్టీ
9. 1989-1994 కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర
10. 1994-1999 అనిపిరెడ్డి వెంకట లక్ష్మి దేవమ్మ తెలుగు దేశం పార్టీ
11. 1999-2004

2004-2009

కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12. 2009-2014 అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగు దేశం పార్టీ
13. 2014 – 2018

2018(బై పోల్)

G. శంకర్ తెలుగుదేశం పార్టీ
14. 2019 – ప్రస్తుతం పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో – Thamballapalle Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

 తంబళ్లపల్లె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • తంబళ్లపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు మండల కేంద్రము.
  • తంబళ్లపల్లె పిన్ కోడ్ : 517 418.
  • హార్సీ హిల్స్ ఈ మండలంలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్.
  • ప్రసిద్ధ ఇండియన్ బోర్డింగ్ స్కూల్ “రిషి వ్యాలీ స్కూల్” ఈ మండలంలో ఉంది.
  • “మల్లయ్య కొండ” వంటి ప్రసిద్ధ హిందూ శివాలయాలు తంబళ్లపల్లెలో ఉన్నాయి. శివరాత్రి సమయంలో లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *