madanapalle-assembly-constituency
Share to Everyone

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకుంటుంది. మరియు ఇది పూర్తిగా 3 మండలాలను కలిగి ఉంది.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Madanapalle Assembly Constituency

  1. రామసముద్రం మండలం
  2. నిమ్మనపల్లి మండలం
  3. మదనపల్లెమండలం

మదనపల్లె నియోజకవర్గంలో గెలిచిన MLA లు

మదనపల్లె నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 12 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1. 1952-1955

(మద్రాసు రాష్ట్రం)

దొడ్డ సీతారామయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2. 1955-1962

(ఆంధ్ర రాష్ట్రం)

టి. గోపాలకృష్ణయ్య గుప్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3. 1962-1967 దొడ్డా సీతారామయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
4. 1967-1972 అల్లూరి నరసింగరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5. 1972-1978 అల్లూరి నరసింగరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. 1978-1983 గంగారపు వెంకట నారాయణరెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7. 1983-1985 రాటకొండ నారాయణరెడ్డి తెలుగు దేశం పార్టీ
8. 1985-1989 రాటకొండ నారాయణరెడ్డి తెలుగు దేశం పార్టీ
9. 1989-1994 ఆవుల మోహన్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10. 1994-1999 రాటకొండ కృష్ణ సాగర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ
11. 1999-2004 రాటకొండ శోభ తెలుగు దేశం పార్టీ
12. 2004-2009 దొమ్మలపాటి రమేష్ తెలుగు దేశం పార్టీ
13. 2009-2014 ఎం.షాజహాన్ బాషా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14. 2014 – 2018

2018(బై పోల్)

డా. M. S. దేశాయ్ తిప్పా రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
15. 2019 – ప్రస్తుతం మహమ్మద్ నవాజ్ బాషా YSR కాంగ్రెస్ పార్టీ

మదనపల్లెఅసెంబ్లీ నియోజకవర్గంలో – Madanapalle Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది

 మదనపల్లె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • మదనపల్లె క్రీ.శ.1618లో శ్రీ మాదన్నచే స్థాపించబడింది.
  • మదనపల్లె పిన్ కోడ్ : 517 325.
  • మదనపల్లి ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్.
  • అన్నమయ్య జిల్లాలో మదనపల్లె పెద్ద నగరం.
  • మదనపల్లెలో 30 నుండి 35 °C సగటు అధిక ఉష్ణోగ్రతలతో తేలికపాటి నుండి వెచ్చని వేసవి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 °C మించవు.

చదవండి :

 

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *