palakonda-assembly-constituency
Share to Everyone

 పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, పార్వతిపురం మన్యం  జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు పాలకొండ పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Palakonda Assembly Constituency

  1. పాలకొండ మండలం
  2. సీతంపేట మండలం
  3. వీరఘట్టం మండలం
  4. భామిని మండలం

పాలకొండ నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

పాలకొండ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1952-1955 పలావాసా సంగం నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1955-1962 పైడి నరసింహప్పరావు ఇండిపెండెంట్
3 1962-1967 కెంబూరు సూర్యనారాయణ నాయుడు స్వతంత్ర పార్టీ
4 1967-1972 జ్. జోజి స్వతంత్ర పార్టీ
5 1972-1978 కొత్తపల్లి నరసయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978-1983 కంబాల రాజారత్నం జనతా పార్టీ
7 1983-1985 శ్యామా రావు గోణిపతి తెలుగుదేశం పార్టీ
8 1985-1989 తలే భద్రయ్య తెలుగుదేశం పార్టీ
9 1989-1994 P. J. అమృత కుమారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994-1999 తలే భద్రయ్య తెలుగుదేశం పార్టీ
11 1999-2004 P. J. అమృత కుమారి భారతీయ జనతా పార్టీ
12 2004-2009 కంబాల జోగులు తెలుగుదేశం పార్టీ
13 2009-2014 నిమ్మక సుగ్రీవులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2014 – 2019 విశ్వాసరాయ్ కళావతి YSR కాంగ్రెస్ పార్టీ
15 2019 – ప్రస్తుతం విశ్వాసరాయ్ కళావతి YSR కాంగ్రెస్ పార్టీ

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో – Palakonda Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
భారతీయ జనతా పార్టీ 1 సారి గెలిచింది
జనతా పార్టీ 1 సారి గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది

పాలకొండ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • పాలకొండ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని షెడ్యూల్డ్ తెగ రిజర్వ్‌డ్ నియోజకవర్గం.
  • పాలకొండ పిన్ కోడ్ : 532 440.
  • అరకులోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి.
  • 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 184,414 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1951) ప్రకారం 1951లో స్థాపించబడింది.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *